Nobel Prize 2024: 2024 కు గాను రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని ముగ్గురు గెలుచుకున్నారు. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది. డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది.
AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం
ప్రోటీన్ యొక్క గణన రూపకల్పనకు గా ను డేవిడ్ బేకర్ కు, అదేవిధంగా ప్రోటీన్ యొక్క నిర్మాణానికి గాను లండన్ కు చెందిన డెమిస్ హస్సాబీస్, జాన్ ఎం జంపర్ లకు నోబెల్ బహుమతి దక్కింది. ఇప్పటికే భౌతిక, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ .
ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న కరోలిన్ స్కా ఇంస్టిట్యూట్ లోని నోబెల్ బృందం ప్రకటించింది. నోబెల్ అవార్డు గెలుచుకున్నవారికి 10 లక్షల డాలర్లు అంటే ( 11 లక్షల స్వీడిష్ క్రోనర్ లు ) నగదు అందుతుంది.
2024 వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్కున్ లు మైక్రో ఆర్ఎన్ఏ , జన్యు నియంత్రణ లో విశేష పరిశోధనలుకు గాను మెడిసిన్ లో నోబెల్ అవార్దు గెలుచుకున్నారని అవార్డు ప్రధాన సంస్థ సోమవారం తెలిపింది.
2024 ఫిజిక్స్ లో విశేష కృషి చేసినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కనుంది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు దక్కింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లతో మిషన్ లెర్నింగ్ ఆవిష్కరించినందుకు వీరికి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.
గురువారం సాహిత్య విభాగం , శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి , చివరి రోజున అక్టోబర్ 14 న అర్ధశాస్త్రం లో నోబెల్ గ్రహీతల పేర్లను తెలపనున్నారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 లో మరణించాడు. తరువాత స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త , వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు తో ప్రతి సంవత్సరం ప్రపంచంలో వివిఐద రంగాలలో వినూత్న సేవలందించిన వారికీ 1901 నుంచి నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 9, 2024
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T
One thought on “Nobel Prize 2024: రసాయన శాస్త్రం లో ముగ్గురిని వరించిన నోబెల్ అవార్డు”